సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు, వెండి, ఇతర విలువైన ఆభరణాలను దేవదాయ శాఖ శుక్రవారం తనిఖీ చేయనుంది. దేవస్థానానికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువుల వివరాలను బహిర్గతం చేయాలని, వాటికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలియజేయాలని కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి గతేడాది నవంబర్‌లో దేవదాయ శాఖలో పిటిషన్ వేశారు. దీంతో దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ డిసెంబర్‌లో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జోన్–1 ఆర్జేసీ, నగల తనిఖీ అధికారులతో కూడిన కమిటీ శుక్రవారం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment