డాక్టర్ సురేష్‌కుమార్‌కు ఘన సన్మానం
జి.మాడుగుల: ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్ పొందిన తెడబారికి సురేష్‌కుమార్‌ను జి.మాడుగులలో గురువారం ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, సన్యాసినాయుడు దంపతులు, మాజీ ఎంపీపీ వెంకట గంగరాజు శాలువ కప్పి సురేష్‌కుమార్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి టెక్నాలజీని అందిపుచ్చుకొని, అనేక రంగాల్లో పరిశోధనలు చేసి ఆయా ఫలాలు ప్రజలకు చేరువ చేయాలని అన్నారు. శాస్త్రవేత్తలుగా, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి సర్వీసులలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడం కోసం ఆయన డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ టీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్‌ను స్ధాపించారని వారు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సేవలందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జల్లి సుధాకర్, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment