ఇంటి స్థలం వివాదంపై విచారణ
చింతపల్లి: లంబసింగిలో ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంపై లోకాయుక్తకు వచ్చిన ఫిర్యాదు మేరకు పాడేరు డివిజినల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. ఇరుపక్షాలకు చెందిన వారితోపాటు గ్రామపెద్దలను విచారించారు. అనంతరం సచివాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. హౌస్‌హోల్డ్ సర్వే, జియో ట్యాగింగ్, ఎన్‌పీసీఐ, స్వర్ణ పంచాయతీల డేటా నమోదు వంటి విషయాలపై సిబ్బందికి సూచనలు చేశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవికి ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఎంపీటీసీ, సర్పంచ్‌లు, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment