రాత పరీక్షకు 221 మంది అర్హత
ఏయూ క్యాంపస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నియామక బోర్డ్ పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా నుంచి రాత పరీక్షకు 221 మంది ఎంపికయ్యారు. గురువారం 280 మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన వారు కై లాసగిరి వద్ద ఉన్న జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి పి.ఎం.టి, పి.ఈ.టి పరీక్షలకు 280 మంది హాజరయ్యారు. ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి బయోమెట్రిక్ తీసుకున్నారు. అనంతరం దేహదారుఢ్య పరీక్షలు జరిపారు. వీరిలో 221 మంది తదుపరి మెయిన్ రాత పరీక్షకు అర్హత సాధించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.మోహనరావు, ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వరావు, ఆర్‌ఐలు ఎల్.మన్మథరావు, బి.రామకృష్ణారావు, ఐటీ కోర్ ఎస్‌ఐ బి.సురేష్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment