కుటుంబ పోషణకు ఉన్నత ఉద్యోగం తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన యువత కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రేరణ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ కోరారు. రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం పోలీస్, ఇన్నోవ్‌సోర్స్ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికై న రంపచోడవరం ప్రాంతానికి చెందిన గిరిజన యువత శిక్షణ కోసం వెళ్లలేదన్నారు. ఇందుకు కారణాలు తెలుసుకున్నామన్నారు. ఇంటిని, స్నేహితులను వదిలి వెళ్లలేక ఇక్కడే ఏదో పని చేసుకుందామన్న ధోరణిలో ఉన్నారని తెలిపారు. బ్యాచ్‌లర్‌గా ఎంత వచ్చిన సరిపోతుందని, అదే కుటుంబ పోషణకు ఉన్నత ఉద్యోగం చేయడం తప్పనిసరి చెప్పారు. జాబ్‌మేళాకు 387 మంది హాజరు కాగా.. 300 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. ఎంపికై న వారి జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సీఐ రవికుమార్, ఎస్‌ఐ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment