విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్‌లో పొందుపరిచారు. అయితే ఈ కేటాయింపులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారనే దానిపై అందరిలోనూ సందిగ్ధం నెలకొంది. ఇటీవల ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిధుల్లో భాగమే ఈ కేటాయింపులు చేశారే తప్ప.. కొత్త కేటాయింపులు కాదని స్టీల్‌ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తొలివిడత కింద కొద్ది నెలల క్రితం రూ.1640 కోట్లు ఇవ్వగా.. తాజాగా శుక్రవారం రాత్రి మరో రూ.6,783 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు మరో రూ.3,295 కోట్లు కేటాయింపులు చేశారు. ఇవి ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో ప్లాంట్ ఎలా ముందుకు దూసుకెళ్లగలదని ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment