‘ఏజెన్సీలో విధులు మరువలేను’
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో పని చేసి గిరిజనులకు సేవ చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని, మంచి సేవలు అందిస్తే ఏ అధికారికై నా గుర్తింపు ఉంటుందని రంపచోడవరం మొబైల్ కోర్టు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ.జాన్‌రాజ్ అన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మేజిస్ట్రేట్‌ను శనివారం న్యాయవాదులు, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, న్యాయవాదులు ఎంవీఆర్ ప్రకాష్, కోలా సత్యప్రసాద్, భగవాన్, చుక్కా సంతోష్‌కుమార్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, భజన వెంకటేశ్వర్లు, శివరంజని, జిలానీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment