తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో 58 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ తన సిబ్బందితో శనివారం స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ప్రసన్ రాజ్, కిశోర్ బలియర్ సింగ్, రాహుల్ పని, పింటు దాస్ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.2.9 లక్షలు విలువైన 58 కిలోల గంజాయిని సీజ్ చేశారు. విశాఖపట్నం మీదుగా ముంబయికి గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment