సాక్షి, విశాఖపట్నం: కర్షక, పారిశ్రామిక, మధ్య తరగతి వర్గాలను కాస్తా ఊరడించేలా.. పద్దు లెక్కలు చదివిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖను మాత్రం పూర్తిగా విస్మరించారు. డీపీఆర్ ఇచ్చినా.. వైజాగ్ మెట్రో ఊసే లేదు.. రైల్వే జోన్ ప్రస్తావన లేదు.. అంతెందుకు విశాఖ పేరు కూడా బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం జిల్లా ప్రజల్నే విస్మయానికి గురిచేసింది. కేవలం ఉద్యోగుల్ని ఊరడిస్తూ.. పన్ను చెల్లింపుదారుల్ని పలకరిస్తూ.. రైతులకు భరోసా ఇస్తూ.. యువతకు నైపుణ్యం అందించేలా చెయ్యందిస్తూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. సాగిన సుదీర్ఘ ప్రసంగం వల్ల విశాఖకు ఒనగూరిన ప్రయోజనాలేవీ కనిపించలేదంటూ ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. అయితే స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు, హిందూస్థాన్ షిప్‌యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ.150 కోట్లు కేటాయించారు. దేశంలోని మేజర్ పోర్టులకు కేటాయించిన మాదిరిగానే విశాఖ పోర్టు అథారిటీకి రూ.730 కోట్లు విదిలించారు.
Comments
Please login to add a commentAdd a comment