ఫీజు పోరుబాటకు సిద్ధం
● అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం పిలుపు
డుంబ్రిగుడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5న తలపెట్టిన ఫీజు పోరుబాటకు సిద్ధం కావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. ఈ మేరకు అరకులోయలోని క్యాంపు కార్యాలయంలో పోరుబాట పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి రూ.3900 కోట్ల బకాయిలను తక్షణయే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయనున్నామని, ముందుగా ఉదయం 10 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తక్షణమే తమ వైఖరి మార్చుకుని విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఫీజు పోరులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పి.చిన్నారావు, ఎంపీటీసీ ఆనంద్, పార్టీ నాయకులు కమ్మిడి అశోక్, నరసింహమూర్తి, అర్జున్, నరసింగరావు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment