పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి, పాడేరు: పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు.చలి అరకు ఉత్సవంలో పాల్గొన్న అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి సంబంధిత గ్రామాలకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తే గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు గిరి జన చట్టాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గిరిజన ఆవాసాల్లో పర్యాటకులు హోంస్టే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాడేరు, రంపచోడవరం,చింతూరు డివిజన్ల పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని,అడ్వంచర్ టూరిజంతో పాటు గిరిజన కళాకారులను గుర్తించాలన్నారు. అనంతరం చలి అరకు ఉత్సవాన్ని విజయవంతం చేసిన అధికారులను అభినందించి, షీల్డ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్ పటేల్,డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి,డీఆర్‌వో పద్మలత, డీఆర్‌డీఏ పీడీ మురళీ,డీపీవో లవరాజు,డీఎల్‌పీవో పి.ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment