![108 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ark12-320113_mr-1738872385-0.jpg.webp?itok=fUjyLQYo)
108 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని గుమ్మకోటలో 108 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహా న్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం గురువారం అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధ్యాన కరుణ మహా చక్రం ప్రకృతి వ్యాలీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణు డి విగ్రహం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఎంపీటీసీ తవిటి నాయుడు, సర్పంచ్‌లు పాగి అప్పారావు, మధులత, వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, నాయకులు తిరుపతి, పాడి కృష్ణమూర్తి, శ్రీను, ఈశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment