![డోకులూరు ఆశ్రమ పాఠశాల వార్డెన్ సస్పెన్షన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06pdr05a-607561_mr-1738872385-0.jpg.webp?itok=YPemkhau)
డోకులూరు ఆశ్రమ పాఠశాల వార్డెన్ సస్పెన్షన్
● ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు ● ఇంగ్లిష్ టీచర్ మెడికల్ బోర్డుకు రిఫర్
సాక్షి,పాడేరు: విఽధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోకులూరు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల వార్డెన్ పి.సింహాద్రిని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సస్పెండ్ చేశారు. అదే పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇంగ్లిష్ టీచర్‌ను మెడికల్ బోర్డుకు రిఫర్ చేశారు. వివరాలు... డోకులూరు ఆశ్రమపాఠశాలను గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆరుబయట తిరగడాన్ని చూశారు. వారిని కలెక్టర్ ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. వెంటనే వార్డెన్ సింహాద్రిని సంజాయిషీ కోరారు. వార్డెన్ వివరణ పట్ల సంతృప్తి చెందని కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అనంతరం 7,8,9 తరగతుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులను పలు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు.బేస్‌లైన్ పరీక్షల్లో వారికి కేటాయించిన గ్రేడ్లపై ఆరా తీశారు.అందుకు ఆయా తరగతుల ఉపాధ్యాయులు సరైన సమాధానం చెప్పకపోవడంతోకలెక్టర్ వారిని మందలించి, ముగ్గురు టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తరచూ మెడికల్ లీవ్‌లో వెళ్తున్న ఇంగ్లిష్ టీచర్ వల్ల ఆంగ్ల విద్యా బోధన కుంటుపడుతోందని గమనించిన కలెక్టర్ ఆ ఉపాధ్యాయుడు రామ్‌సాగర్‌ను మెడికల్ బోర్డుకు రిఫర్ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment