చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని పోతురెడ్డిపాలెంలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన పిల్లి సోమరాజు(34) బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. రోజువారీ కూలీ అయిన సోమరాజు ఈ నెల 16న వ్యక్తిగత పనులపై పోతురెడ్డిపాలెం నుంచి యలమంచిలి వచ్చి తన ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా గ్రామంలో రామాలయం దగ్గర శునకం అడ్డు రావడంతో కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో విశాఖ కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. సోమరాజు భార్య సాయికుమారి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment