ఎన్టీఆర్ ఆస్పత్రిలో ప్రైవేట్ కుట్ర
తొలుత అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు ప్రతిపాదన లేదు. నా కృషితో అప్పటి కేంద్ర మంత్రి ప్రోత్సాహంతో రూ.22.15 కోట్లు తీసుకొచ్చాం. అందులో 5 బెడ్ల సదుపాయంతో డయాలసిస్ బ్లాక్ ఏర్పాటు కూడా ఉంది. కూటమి ప్రభుత్వానికి కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్ష ఉంటే ఆ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కోట్ల ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేపడుతున్న దాన్ని మూలన పడేసి..ఇప్పుడు పీపీపీ పద్ధతిలో డయాలసిస్ కేంద్రంను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
– డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ
పీపీపీ విధానంలో డయాలసిస్ కేంద్రం
ఇప్పటికే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 170 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యం అందుబాటులోకి రానుంది. పీపీపీ విధానంలో సేవలు అందుతాయి. దీనికోసం ఆస్పత్రిలో వార్డును కేటాయించాం. డయాలసిస్ చేయించుకునే రోగులకు అయ్యే ఖర్చును ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సగం భరిస్తుంది. కేంద్రం ఏర్పాటు వేగవంతం చేసి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు వచ్చాయి. గతేడాది క్రిటికల్ కేర్ యూనిట్‌లో కూడా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అది నిర్మాణ దశలో ఉంది.
– డాక్టర్ శ్రీనివాసరావు, డీసీహెచ్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment