గంజాయి నిర్మూలనకు గట్టి ‘సంకల్పం’
● డీఐజీ గోపీనాథ్ జెట్టి
పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గౌరవవందనం స్వీకరిస్తున్న డీఐజీ గోిపీనాథ్ జెట్టి
అనకాపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి గురువారం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ విభాగాలను పరిశీలించి, మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృిష్టి సాధించడం జరుగుతుందన్నారు. ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి లో ప్రజలకు గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2022, 2023, 2024 పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు, చీటింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ టి.వి.విజయకుమార్, ఎస్‌ఐ వి.సత్యనారాయణ, డి.ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీ యువతకు స్మార్ట్ మీటర్ టెక్నీషియన్ శిక్షణ
ఎంవీపీకాలనీ (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)యువతకు స్మార్ట్ మీటర్ టెక్నీషియన్లుగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (నేక్) సంస్థ ద్వారా ఎస్సీ యువతకు ఈ శిక్షణ అందించనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన యువత ఈ ఉచిత శిక్షణకు అర్హులని, శిక్షణ సమయంలో నెలకు రూ.7,500 స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. త్వరలో శిక్షణ ప్రారంభ తేదీని ప్రకటిస్తామని, పూర్తి వివరాలకు 83090 03957 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment