అపరాల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు
నాతవరం : అపరాలు సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక అదాయం పొందవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్‌రావు అన్నారు. మండలంలో మర్రిపాలెం గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం అపరాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా వాతావరణ పరిస్థితులు రిత్యా వాతావరణ కేంద్రం హెచ్చరిక మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెండు రోజుల పాటు వరి చేను కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. అనంతరం మాట్లాడుతూ విత్తన శుద్ధి పంట మార్పిడి సస్య రక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడితే రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. కాలాను గుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ సాగు విధానంలో మార్పు రావాలన్నారు. వరి పంట కంటే అఽధికంగా అపరాలు సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు చేస్తే రైతులు ఉహించిన అదాయం పొందవచ్చున్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి దమయంతి, జిల్లా వనరుల కేంద్రం అఽధికారి విజేత, పాయకరావుపేట వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment