పథకాల అమల్లో సమష్టి కృషి
మహారాణిపేట(విశాఖ): ప్రభుత్వ పథకాల అమలులో శతశాతం చురుకై న పాత్ర పోషించాలని, ఇంటి పన్నులు వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విస్తరణ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కుటుంబమంతా టీం వర్కుగా పనిచేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, డుమా పీడీ పూర్ణిమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి పి.శ్రీనివాసరావు, డీపీఆర్‌సీ ప్రిన్సిపాల్ ఇ.నాగలక్ష్మి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, విస్తరణ అధికారులు (పీఆర్‌అండ్‌ఆర్‌డీ), అనకాపల్లి, జిల్లా మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment