కంపెనీ సెక్రటరీ కోర్సు ఉపాధికి సోపానం
మాట్లాడుతున్న మనోజ్
చోడవరం రూరల్ : కామర్స్ విద్యార్థులకు కంపెనీ సెక్రటరీ కోర్సు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు సోపానం లాగా ఉపకరిస్తుందని విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ చైర్మన్ మనోజ్ తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగ, అవకాశాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కంపెనీ సెక్రటరీ ఉద్యోగంలో లభించే సౌకర్యాలు, ఇతర సదుపాయాలను గురించి మనోజ్ వివరించారు. ఈ కోర్సులో ఒకటి, రెండు, మూడు దశలలో ఉండే ఉద్యోగ అవకాశాల పట్ల సంపూర్ణ అవగాహన కల్పించారు. సదస్సులో పాల్గొన్న ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కామర్స్ కోర్సు చదివిన విద్యార్థులకు పట్టణాల్లో ఉద్యోగ అవకాశాల్లో మంచి డిమాండ్, ఇలాంటి అదనపు కోర్సులను నేర్చుకుంటే త్వరగా ఉద్యోగాల్లో కుదరుకునే అవకాశాలు ఎక్కువవుతాయన్నారు. కామర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ వి.అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో కళాశాలలోని కామర్స్ విద్యార్థులకు ఇతర విద్యార్థుల కంటే మెరుగైన అవకాశాలు వస్తున్న సంగతి గుర్తు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ గణేష్, వినోద్‌లు కంపెనీ సెక్రటరీ కోర్సు పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించారు. కామర్స్ డిపార్ట్‌మెంట్ లెక్చరర్ బి.పిచ్చమ్మ, గెస్ట్ లెక్చరర్ శ్రీనివాసరావు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment