ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
● ఓ మహిళ దుర్మరణం.. పలువురికి గాయాలు
మాకవరపాలెం: ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన ప్రమాదంలో ఒ మహిళ దుర్మరణం చెందింది. కశింకోట మండలం భీమవరం సమీపంలో ఉన్న బీర్లు కంపెనీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. భీమభోయినపాలెం శివారు చింతలూరుకు చెందిన మహిళలు నిత్యం ఆటోలో కంపెనీకి వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పనులు ముగించుకుని వస్తుండగా శెట్టిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రెడ్డి సత్యవతి(40) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరి కొందరు మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దామోదర్‌నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త లారీ డ్రైవర్ కాగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment