తుమ్మపాల: ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’సుపరిపాలనపై కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధ్వర్యంలో గురువారం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా నుంచి ఆమెతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం, పౌరులకు మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో 2019–24 కాలంలో ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కార వేదికను ప్రతి సోమవారం నిర్వహిస్తూ, జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిస్తుందన్నారు. గురువారం నుంచి ఈ నెల 24 వరకూ ప్రశాసన్ గావ్ కి ఒరే క్యాంపెయిన్, గుడ్ గవర్నెన్స్ వీక్ నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సుపరిపాలన నమూనాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment