అల్లిపురం: సైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివీ.. తూర్పు నావికాదళంలో తమిళనాడుకు చెందిన రంజిత్ (23) సైలర్‌గా విధులు నిర్వర్తిసున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవులో ఉన్న అతను చావులమదుం వద్ద గల పవనపుత్ర లాడ్జిలో దిగాడు. గురువారం సాయంత్రం వరకు రంజిత్ లాడ్జి నుంచి బయటకు రాకపోవడంతో.. సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేసింది. పోలీసులు లాడ్జికి చేరుకుని గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. వీలుకాక పోవడంతో బాల్కనీ కిటికీలో నుంచి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఆయన ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో గది తలుపులు పగలగొట్టి..లోపలికి ప్రవేశించారు. మృతదేహాన్ని దించి కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అతని వద్ద గల ఆధారాలతో నేవల్ అధికారులు, అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment