450 కేజీల గంజాయి పట్టివేత
● విలువ రూ.22 లక్షలు ● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● నర్సీపట్నం డీఎస్పీ మోహన్ వెల్లడి
గొలుగొండ: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న 450 కేజీల గంజాయిని గొలుగొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ మోహన్ గొలుగొండలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతంలో రాజేష్ శర్మ, కిల్లో మహదేవ్ అనే ఇద్దరు యువకులు వ్యాన్ పైభాగంపై మెర ఏర్పాటు చేసి 450 కేజీల గంజాయిని రంపుల, కృష్ణదేవిపేట మీదుగా గొలుగొండ నుంచి తరలిస్తున్నారు. ఈ సమయంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసులు గురువారం వాహన తనిఖీల్లో భాగంగా గొలుగొండలో ఆ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువు సుమారుగా రూ.22 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపునకు సహకరించిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్‌ఐలు రామారావు, తారకేశ్వర్రావును డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment