కిర్రాక్ ఫీచర్లతో వీవో ఎక్స్200 సిరీస్
డాబాగార్డెన్స్(విశాఖ): ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెల్‌పాయింట్ ఇండియా వీవో ఎక్స్ 200 సిరీస్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించింది. డాబా గార్డెన్స్‌లోని సెల్‌పాయింట్ స్టోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మోహన్‌ప్రసాద్ పాండే ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేలు పీజీవీఆర్ నాయుడు(గణబాబు), వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ మొబైల్ ఫోన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఏ కంపెనీ కొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేసినా అవి ముందుగా సెల్‌పాయింట్‌లోనే అందుబాటులోకి వస్తాయన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సెల్‌పాయింట్ అధినేతను ఆయన అభినందించారు. చైర్మన్ మోహన్‌ప్రసాద్ పాండే మాట్లాడుతూ విశాఖపట్నంలో తొలిసారిగా డైమండ్ పార్క్ వద్ద సెల్‌పాయింట్‌ను ప్రారంభించామని, ప్రస్తుతం విశాఖలో 29, రాష్ట్ర వ్యాప్తంగా 82 స్టోర్లకు విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. వీవో ఎక్స్200 సిరీస్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ సిరీస్ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఉచితంగా హ్యాపీ పోలా 100 వాట్స్ సౌండ్‌బార్, వీవో బడ్స్ టీడబ్ల్యూఎస్ 3ఈ ఏఎన్‌సీ అందిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని ఉత్పత్తులపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. భాగస్వామ్య బ్యాంకుల ద్వారా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, శాంసంగ్, ఎంఐ, ఎల్‌జీ, సోనీ, హైయర్, ఏసర్ వంటి టాప్ బ్రాండ్లపై 50 శాతం వరకు డిస్కౌంట్, యాక్సరీస్‌పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సెల్‌పాయింట్ ప్రతినిధి బాలాజీ పాండే, వీవో సంస్థ ప్రతినిధి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment