నేడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
● వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రేపు సేవా కార్యక్రమాలు ● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్
మునగపాక: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. స్థానిక బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ గతంలో మెరుగైన పాలన అందించారన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం కేక్ కటింగ్ జరుగుతుందన్నారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అదే రోజు అచ్యుతాపురం మండలం కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్‌లోని దివ్యాంగ పిల్లలకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించామన్నారు. శుక్రవారం మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment