సిబ్బంది కొరత ఉన్నా మెరుగైన సేవలు
● జిల్లా ట్రెజరీ అధికారి సుభాషిణి
కోటవురట్ల : సబ్ ట్రెజరీ కార్యాలయాలలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సర్దుబాటుతో ఇబ్బంది ఏర్పడకుండా కార్యాలయాలు నడుపుతున్నామని జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీ సుభాషిణి తెలిపారు. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. రికార్డులు పరిశీలించి సమస్యలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం పెన్షనర్లు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 8 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. మూడు చోట్ల సొంత భవనాలు ఉన్నాయని, 2018లో కోటవురట్ల, నక్కపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి ఈస్ట్ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరైనట్టు తెలిపారు. ఒక్కో భవనానికి రూ.75 లక్షలు మంజూరు కాగా కోటవురట్లలో భవన నిర్మాణం దాదాపు 60 శాతం, నర్సీపట్నంలో 50 శాతం పూర్తయినట్టు తెలిపారు. నక్కపల్లికి సంబంధించి సాంకేతిక సమస్యతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఇక్కడ భవనం మంజూరు కాగా స్ధలం పాయకరావుపేటలో చూపిస్తోందని, దాంతో మొదలు కాలేదన్నారు. అనకాపల్లి ఈస్ట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు స్ధలం కేటాయించలేదని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు స్థలం కేటాయించాలని దరఖాస్తు చేసినట్టు తెలిపారు. సబ్ ట్రెజరీ అధికారి రామారావు, సిబ్బంది, పెన్షనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment