పాఠశాల స్థాయి నుంచే దివ్యాంగుల గుర్తింపు
● డీఈవో గిడ్డి అప్పారావునాయుడు
అనకాపల్లి: దివ్యాంగ పిల్లల గుర్తింపు ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే జరగాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. స్థానిక వేల్పులవీధి టౌన్ గర్‌ల్స్ హైస్కూల్ ఆవరణలో విద్యా శాఖ సమగ్ర శిక్ష, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక రోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం జిల్లా డైరెక్టర్ జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల ఉపకరణాలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ రాష్ట్ర స్థాయి అబ్జర్వర్ అమ్మినాయుడు, సీడీపీవో పి.ప్రభావతి, సమగ్ర శిక్షణ సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment