విశాఖ సిటీ:
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్టు కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా లోచల సుజాత నియమితులయ్యారు. నర్సీపట్నానికి చెందిన కోరుప్రోలు ఫణిశాంతారావును వలంటీర్స్ వింగ్‌కు, ఎ.నాయుడుబాబును కల్చరల్ వింగ్‌కు, పిల్లా శ్రీనును పబ్లిసిటీ వింగ్‌కు అధ్యక్షులుగా నియమించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన తాజుద్దీన్ బాబా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా, సురకాసుల గోవింద్ గ్రీవెన్స్‌సెల్‌కు, కొమ్మన వెంకటేశ్వరరావు వీవర్స్ వింగ్‌కు అధ్యక్షులుగా నియమితులయ్యారు.
జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఉద్దండం త్రినాథరావును, ఎస్సీ సెల్‌కు పిల్లి అప్పారావు, పంచాయతీరాజ్ వింగ్‌కు బొడ్డపు అప్పన్న దొర, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడిగా చోడిపల్లి అప్పారావులను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment