దేవరాపల్లి: సాగునీటి వినియోగదారుల సంఘాల (మైనర్, మీడియం) ఎన్నికలు ముగియడంతో రైవాడ ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పరిధిలో దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం మండలాల్లో 10 మీడియం ఇరిగేషన్ సంఘాలు ఉన్నాయి. చోడవరం మండల పరిధిలోని ఒక సంఘం ఎన్నిక జరగలేదు. మిగిలిన 9 మీడియం సంఘాల అధ్యక్షులు ప్రాజెక్టు చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు చైర్మన్‌గా దేవరాపల్లి మండలం ఎం. అలమండకు చెందిన పోతల పాత్రునాయుడును, వైస్ చెర్మన్‌గా కె.కోటపాడు మండలం ఎ. కోడూరుకు చెందిన బొడ్డు ఉమాదేవిని ఎంపిక చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రకటించారు. కాగా అధికారికంగా శనివారం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇరిగేషన్ డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment