అనకాపల్లి డీఎంహెచ్‌వోగా డాక్టర్ రవికుమార్
మహారాణిపేట (విశాఖ): జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌వో)లను బదిలీ చేశారు. మరి కొంత మందిని పలు ఆస్పత్రుల్లో సీఎస్‌ఆర్‌ఎంవోలుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పి.రవికుమార్‌ను అనకాపల్లి జిల్లా డీఎంహెచ్‌వోగా నియమించారు. ఈ జిల్లాలోని కె.కోటపాడు సీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ ఎస్.శ్రీనివాస్‌ను ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. తిరుపతి డీఎంహెచ్‌వో డాక్టర్ యు.శ్రీహరిని కేజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment