పదిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మునగపాక: మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌ను శనివారం అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడు సందర్శించారు. జెడ్‌పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ ఇటీవల స్టాండింగ్ కమిటీ సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సంబంధించి డీఈవో హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల పుస్తకాలు పరిశీలించడంతో పాటు మధ్యాహ్న భోజన పఽథకం అమలు తీరును గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్థులు కూడా ఇష్టపడి, కష్టపడి చదువుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న టాయ్‌లెట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆయన వెంట జెడ్‌పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, పీఎంసీ వైస్ చైర్మన్ బొడ్డేడ మహేష్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి అప్పారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment