సేవా సంబరం
జన హృదయనేత.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లా అంతటా వేడుకగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానాలు, అన్నదానాలు, దుప్పట్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బర్త్‌డే కేక్‌లు కట్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు.
జనాభిమానం..
సాక్షి, అనకాపల్లి:
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్‌లు, మిఠాయిల పంపిణీతోపాటు జిల్లాలో ఊరూరా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు రక్తదానం చేశారు. వాటితోపాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగులకు, వృద్ధులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అనకాపల్లి టౌన్‌లో గల స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎంపీ బీవీ సత్యవతి, సమన్వయకర్త భరత్‌కుమార్‌లు పాల్గొని కేక్ కట్ చేశారు. నెహ్రూచౌక్‌లో వైఎస్సార్‌సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్ ఆధ్వర్యంలో 1000 మంది నిరుపేదలకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలసాల భరత్‌కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు.
పార్టీలకు అతీతంగా సంక్షేమం
పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. శనివారం మాడుగుల మండలం ఘాట్‌రోడ్ జంక్షన్‌లో నిర్వహించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందజేసిన ఏకై క నాయకుడన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నాయని, వైఎస్ జగన్ అందజేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువస్తాయని అభిప్రాయ పడ్డారు. అంతకుముందు మాడుగుల ఆర్‌సీఎం వృద్ధాశ్రమంలో వృద్ధులకు, స్థానిక ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రిలో రోగులకు పాలు రొట్టెలు, పండ్లు అందజేశారు. అనంతరం ఘాట్‌రోడ్ జంక్షన్‌లో మోదకొండమ్మ పాదాలు వద్ద జగన్‌మోహన్‌రెడ్డి పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు పార్టీ శ్రేణులతో కలిసి నిర్వ హించారు. ముందుగా మండలం నలు మూలల నుంచి అఽధిక సంఖ్యలో తరలి వచ్చిన అశేష పార్టీ శ్రేణుల నడుమ భారీ కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు.
●పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం గ్రామంలో మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొన్నారు. కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ ఆర్.ఎస్ సీతారామరాజు(దత్తుడుబాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సమన్వయకర్త పాల్గొన్నారు. నక్కపల్లి మండలంలో పార్టీ కార్యాలయంలో మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో, పారిపల్లిపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు శీరం నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొన్నారు.
●అచ్యుతాపురంలో పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త యూవీ రమణమూర్తి రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. నియోజక వర్గంలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఏ కన్నబాబు రాజు కేక్ కట్ చేశారు. మోసయ్యపేటలోని ఇంటిగ్రేటెడ్ వికలాంగుల ఆశ్రమంలో అన్నసమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుడైన ఎనిమిదవ తరగతి విద్యార్థి దుర్గా ప్రసాద్‌కు మాజీ ఎంఎల్‌ఏ కన్నబాబు చేతుల మీదుగా ట్రై సైకిల్ అందజేశారు.
●మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చోడవరం కార్యాలయంలో కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. గాంధీగ్రామంలో విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీచేశారు. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం, గోవాడ శివాలయం, శ్రీ వేంకటేశ్వరస్వా మి ఆలయాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి పేరున ప్రత్యేక పూజాకార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. రావికమతం మండలంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
●నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం టౌన్‌లోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. అనంతరం రక్తదానం చేశారు. నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రపాత్రుడు, డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు
అనాథాశ్రమంలో చిన్నారులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ
ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
పండగలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment