ఫార్మర్స్ రిజిస్ట్రీపై శిక్షణ
మాట్లాడుతున్న ఏడిఎ టి.శ్రీదేవి
నర్సీపట్నం : రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా అగ్రిస్టాక్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చిందని ఏడీఏ టి.శ్రీదేవి అన్నారు. ఫార్మర్స్ రిజిస్ట్రీలో రైతుల వివరాలను పొందుపర్చాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన రైతు సేవా కేంద్రం ఇంచార్జీలకు ఫార్మర్స్ రిజిస్ట్రీ మీద శిక్షణ కార్యక్రమాన్ని ఏడిఎ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. శిక్షణలో ఏడీఏ మాట్లాడుతూ రైతుల వివరాల నమోదు ద్వారా వచ్చే రైతు విశిష్ట సంఖ్యను సంక్షేమ పథకాలకు, నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ ధరలు రైతులకు అందజేయడానికి దోహదపడుతుందన్నారు. ఫార్మర్స్ రిజిస్ట్రీ ద్వారానే నగదు బదిలీ జరుగుతుందన్నారు. అనంతరం రిజిస్ట్రీ విధానంపై జిల్లా వనరులు కేంద్రం ఏడీఏ ఝాన్సీ అవగాహన కల్పించారు. రైతు ఆధార్, భూమి పాసుపుస్తకం, 1–బి, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబరు కచ్చితంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏవో విజేత, ఐదు మండలాల వ్యవసాయాధికారులు, రైతు సేవా కేంద్రం ఇంఛార్జీలు , సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment