భూబాంబ్
పేలనున్న
అభ్యంతరాలకు అవకాశం ఏదీ ?
ఆదాయం పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైంది. నూతన సంవత్సరంలో ప్రజలకు నడ్డి విరిచే నజరానా అందజేయనుంది. భూముల విలువలను అమాంతం పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌శాఖను ఆదేశించింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైన సమయంలో భూముల మార్కెట్ విలువ పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో సామాన్య ప్రజలతో పాటు రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.సంపద సృష్టించడం అంటే ఇదేనా అంటూఅందరూ వాపోతున్నారు.
● ప్రజలపై మరో బాదుడు
● వచ్చేనెల ఒకటి నుంచి పెరగనున్న
మార్కెట్ విలువలు,రిజిస్ట్రేషన్ చార్జీలు
● గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 5 శాతం నుంచి 50 శాతం వరకు పెంపు
● ఇప్పటికే పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
● జిల్లాలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మరింత భారం కానున్నదస్తావేజుల రిజిస్ట్రేషన్లు
● ఇప్పటికే ఎస్‌ఆర్‌వో కార్యాలయాల్లోప్రదర్శించిన ధరల వివరాలు
● జిల్లా కమిటీ ఆమోదం లాంఛనమే
రియల్ ఎస్టేట్ వెంచర్
నిబంధనల ప్రకారం జిల్లాలోని అనకాపల్లి,యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల,నర్సీపట్నం,చోడవరం, మాడుగుల,కె కోటపాడు, లంకెలపాలెం,సబ్బవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 20వ తేదీనే భూముల విలువ పెంపునకు సంబంధించిన వివరాలను కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో అతికించాలి. అయితే యలమంచిలిలో ఆదివారం ఉదయం అతికించారు. మిగిలిన కార్యాలయాల్లో వివరాలను ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచలేదు.దీనినిబట్టి ప్రజలు తమ అభ్యంతరాలను చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భూములు,స్థలాలు,కట్టడాల మార్కెట్ విలువలను పెంచడానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.
వచ్చేనెల 1 నుంచి...
Comments
Please login to add a commentAdd a comment