ప్రజల నడ్డి విరుస్తున్నారు
పేదలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు భూములు,కట్టడాలతో పాటు షెడ్లు,పూరి గుడిసెలకు సైతం మార్కెట్ విలువలు,రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు.ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదు. అమాంతం మార్కెట్ ధరలు పెంచడంతో ప్రజలపై మోయలేని భారం పడుతుంది. ఒక్కసారిగా భూముల ధరలు పెంచితే సామాన్యుడికి ఆస్తులు సమకూర్చుకునే అవకాశం ఎలా ఉంటుంది.కరోనా తర్వాత సామాన్య ప్రజల ఆర్థిక స్థితి ఇంకా కోలుకోలేదు.ఇది చాలా అన్యాయం,ఏకపక్షం.
– చింతకాయల శివాజీ,సీఐటీయూ నాయకుడు,యలమంచిలి
Comments
Please login to add a commentAdd a comment