తాటిచెట్లపాలెం(విశాఖ): విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. స్టేషన్‌కి వచ్చిన ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. ఆది వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరునెల్వేలి–పురులియా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(22606) ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కి చేరుకుంది. రైలు ఇంజిన్‌ను మార్పు చేస్తున్న క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ విద్యుత్ తీగలను కొంతదూరం వరకూ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై వాల్తేర్ డివిజన్ అధికారులు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌లో 3, 4 ప్లాట్‌ఫారాలపై ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే 3వ నంబర్ ప్లాట్‌ఫాంపై తొలగించిన వైరును ఇంజిన్ ఈడ్చుకుని వెళ్లిందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment