No Headline
యలమంచిలి రూరల్: భూములు,స్థలాలు,నిర్మాణాల విలువలను అమాంతం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు పక్కనపెట్టి వరుసగా ప్రజలపై మోయలేని భారాలు పెడుతోంది. ఒకపక్క నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండగా విద్యు త్ చార్జీల పెంపుతో ప్రజల నడ్డివిరిచిన కూటమి ప్రభు త్వం తాజాగా భూముల మార్కెట్ విలువ,రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచాలని రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. 2025 సంవత్సరాన్ని కొత్త బాదుడుతో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
భారీగా పెరగనున్న
ఆర్‌సీసీ నిర్మాణాల ధరలు
కొత్త నిబంధనల ప్రకారం ఆర్‌సీసీ నిర్మాణాల ధరలు భారీగా పెరగనున్నాయి. కార్పొరేషన్లు,మున్సిపాలిటీల పరిధిలోని అపార్టుమెంట్లలో మొదటి రెండు అంతస్తుల్లోని ప్లాట్లకు ఒక్కో చదరపు అడుగుకు రూ.90 పెరగనుంది.ఇప్పటివరకు చదరపు అడుగు రిజిస్ట్రేషన్ విలువ రూ.1,400 ఉండగా దీన్ని రూ.1,490కి పెంచుతున్నారు. కొన్ని పట్టణాభివృద్ధిసంస్థల పరిఽధిలోని, నగర పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.70 పెంచనున్నారు.మూడో అంతస్తు నుంచి మాత్రం గతంలో వసూలు చేసే రేట్లనే కొనసాగించనున్నారు. వాణిజ్య భవనాలకు మాత్రం చదరపు అడుగుకు గతంతో పోల్చితే రిజి స్ట్రేషన్ విలువ రూ.100 పెరగనుంది.ఈ లెక్కన జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతో పాటు అచ్యుతాపురం,చోడవరం, పాయకరావుపేట,నక్కపల్లి,సబ్బవరం,లంకెలపాలెం తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారులు,ప్రధాన రహదారులకు రెండు వైపులా ఒకేలా ధరలు పెంచడానికి దస్త్రాలు సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment