ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా కూటమి ప్రభుత్వం జిల్లాలో భూ విలువల పెంపునకు సిద్ధమైంది. ఈమేరకు జిల్లా అధికారులు పెంపు నివేదికలు సిద్ధం చేసి, ముసాయిదాను జిల్లా రిజిస్ట్రార్,10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచారు. ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి,26న వాటిని పరిశీలిస్తారు.ఈ నెల 27న తుది జాబితాకు జిల్లా మార్కెట్ విలువల కమిటీ ఆమోదం తెలుపుతుంది.ఆ తర్వాత జనవరి 1 నుంచి పెరిగిన భూముల విలువలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే భూముల విలువ తక్కువగా ఉందనుకునే ప్రాంతాల్లో 5 నుంచి 15 శాతం, మిగతా ప్రాంతాల్లో 20 నుంచి 60 శాతం వరకు పెంచే విధంగా నివేదికలు సిద్ధం చేయడంలో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. భూములు,నిర్మాణాల విలువలను రెసిడెన్షియల్,కమర్షియల్ కేటగిరీలుగా విభజించి ధరలు పెంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment