జీవీఎంసీకి పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అవార్డు
డాబాగార్డెన్స్(విశాఖ): పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్‌ఎస్‌ఐ)–2024 జాతీయ స్థాయి పురస్కారం జీవీఎంసీకి లభించింది. ‘ఉత్తమ ప్రజా అవగాహన కార్యక్రమ’ కేటగిరీలో ప్రథమ స్థానం దక్కిందని జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో నిర్వహించిన 46వ ఆలిండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ నెల 21న ఫార్మర్ ఎంపీ డాక్టర్ నందకుమార్ సాయి, పీఆర్‌ఎస్‌ఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అజిత్ పాఠక్, నేషనల్ జనరల్ సెక్రటరీ, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డాక్టర్ పీఎల్‌కే మూర్తి నుంచి ఈ అవార్డును జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, పీఆర్వో ఎన్.నాగేశ్వరరావు అందుకున్నారు. 2023 నుంచి జీవీఎంసీ చేపడుతున్న ఎకో–వైజాగ్, స్వచ్ఛ సర్వేక్షణ్, సీజనల్ వ్యా ధుల నియంత్రణ, వ్యర్థాలవిభజన, హోమ్ కంపోస్టింగ్, కమ్యూనిటీ గార్డెనింగ్,నీటి పొదుపు,సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన తదితర అంశాలపై నగరప్రజలను అవగాహన పరిచినందుకు గాను జీవీఎంసీ ఈ అవార్డు ఎంపికై ందన్నారు. విశాఖ నగర ప్రజలు, నగర మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లు, నివాసిత సంక్షేమ సంఘాలు, ఫిల్మ్, స్పోర్ట్స్ సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థల సహకారంవల్లే ఈ పురస్కారం లభించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment