● అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో గజం భూమి విలువ సుమారు రూ.1,300 ఉంది.దాని విలువ సుమారు 60 నుంచి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 60 శాతం అంటే దాదాపు రూ.2,080 అవుతుంది.ఇటీవల అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా భూసేకరణకోసం అక్కడ భూములు కోల్పోయిన వారు పరిహారాన్ని భారీగా అడిగారు.దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ గ్రామంతో పాటు రహదారికి ఇరువైపులా అన్ని చోట్ల స్థలాల విలువను బట్టి రేట్లు భారీగా పెరగనున్నాయి.
● యలమంచిలి పట్టణంలో రూ.90 లక్షలున్న ఆర్‌సీసీ శ్లాబ్ భవనం తాజా రేట్ల ప్రకారం రూ.కోటి వరకు పెరుగుతుంది.స్టాంపు డ్యూటీ 7.5 శాతం అంటే రూ.6.75 లక్షల నుంచి రూ.7.5 లక్షలకు పెరుగుతుంది.ఇందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.
● యలమంచిలి పట్టణంలో గతంలో వివిధ ప్రాంతాల్లో గజం స్థలం ధర రూ.4,500 నుంచి రూ.7,000 వరకు ఉండేది.తాజా రేట్ల సవరణ ప్రకారం పట్టణంలో అన్ని చోట్ల గజం ధర ఒకేలా ఏకంగా రూ.7500 కు పెంచేస్తున్నారు.దీంతో స్థలాల రిజిస్ట్రేషన్ మరింత భారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment