మైమరపించిన మోహిని భస్మాసుర నృత్య రూపకం
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ఉత్సవాల్లో 3వ రోజు మద్దిలపాలెంలో కళాభారతి ఆడిటోరియంలో మోహినీ భస్మాసుర నృత్యరూపం ప్రేక్షకులు మైమరపించింది. కళాభారతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాంబాబు, ముఖ్య అతిథి కనక మహాలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, డైరెక్టర్లు నాగేశ్వరరావు, నాట్యాచార్యుడు హరి రామ్మూర్తి ప్రారంభించారు. అనంతరం మోహినీ భస్మారసుర నృత్యరూపకంలో శ్రీ మహావిష్ణువు దుష్టశక్తులను, రాక్షసులను సంహరించడానికి అనేక అవతారాలు ఎత్తిన వైనాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. నృత్యరూపకంలో గురు శ్రీ హరీ రామ్ మూర్తి భస్మాసురుడుగా, సన్నిధ మోహినిగా, సుబ్బరాజు (చైన్నె ) పరమేశ్వరుడిగా అద్భుతంగా నృత్యం చేసి అందరి హృదయాలను రంజింపజేశారు. అనంతరం గురు శ్రీ హరి రామమూర్తిని ఘనంగా సత్కరించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment