పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
రాంబిల్లి(యలమంచిలి) : రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామం సమీపంలో యలమంచిలి–గాజువాక బైపాస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులను తీసుకువెళుతు న్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. రాంబిల్లి ఎస్‌ఐ నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం రాంబిల్లి నుంచి ప్రయాణికులను యలమంచిలి తరలిస్తున్న పాసింజర్ ఆటో మామిడివాడ గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణికులు స్వల్పగాయాలు పాలయ్యారు. వారిని రాంబిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు ఇంకా అందలేదని ఎస్‌ఐ చెప్పారు.
పేకాడుతున్న 9 మందిపై కేసు
యలమంచిలి రూరల్: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల పేకాడుతున్న 9 మందిపై రెండు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై కె సావిత్రి ఆదివారం రాత్రి తెలిపారు. యలమంచిలి పట్టణానికి సమీపంలో శేషుకొండ కాలనీ వద్ద పొలాల్లో పేకాడుతున్న నలుగురు నుంచి రూ.1,350, కల్కి లాడ్జి ఎదురుగా వ్యాన్ల స్టాండు వద్ద పేకాడుతున్న మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1,850, పేక ముక్కలు స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. రెండు కేసులను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment