బాల వికాస్ గురువులకు శిక్షణ తరగతులు
దేవరాపల్లి : మండలంలోని కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల బాల వికాస్ గురువులకు మానవత విలువలపై శిక్షణ తరగతులను నిర్వహించారు. సత్య సాయి సేవా సంస్థల అనకాపల్లి జిల్లా విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో గురువులు పిల్లల పట్ల అనుసరించాల్సిన విధానం, బోధన విధానం తదితర ఐదు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రార్థన, మౌనంగా కూర్చోవడం, కథలు చెప్పడం, సామూహిక గానం, ఆధ్యాత్మిక ఆటలను ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఈ శిక్షణ తరగతులకు రెండు మండలాల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు, గురువులు పాల్గొనగా, శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా విద్యా విభాగ సమన్వయ కర్తలు ప్రశాంతి, పద్మజ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు కశిరెడ్డి అప్పలనాయుడు, జిల్లా విద్యా విభాగ సయన్వయకర్త శక్తి, మండల ఇంచార్జి ఆదిరెడ్డి చినకన్నబాబు, జిల్లా భజన ఇంచార్జి స్వామినాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment