బొజ్జన్న కొండకు భారీగా సందర్శకులు
తుమ్మపాల: అనకాపల్లి మండలం శంకరంలో గల బొజ్జన్నకొండకు ఆదివారం సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు బొజ్జన్నకొండ, లింగాల కొండలపై గల బౌద్ధస్థూపాలు, గుహలు, రాతి చిహ్నలు, కొండ చుట్టూ ఉన్న పంటపొలాలను, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించారు. ఆహ్లాదకర వాతావరణంలో రోజంతా సందడి చేశారు. కొండ దిగువున గార్డెన్‌లో చిన్నారులు ఆటపాటలతో సాయంత్రం వరకు గడిపారు. పలు సంఘాల వారు వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు
Comments
Please login to add a commentAdd a comment