పెరిగిన కాల్స్ వినియోగం
జనసాంద్రత పెరుగుతున్న కారణంగా, ఒక్కో టవర్ పరిధిలో కాల్స్ వినియోగం కొద్ది నెలలుగా గణనీయంగా పెరిగింది. ఇదే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సాధారణంగా ఒక కాల్ కనెక్ట్ అవ్వడానికి కొన్ని క్షణాల వ్యవధి పడుతుంది. ఈ సమయాన్ని కేటాయించడంలో ఆలస్యం జరిగితే కాల్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వినియోగదారుడు వాడే మొబైల్ మోడల్‌ను బట్టి 2జీ, 3జీ, 4జీ, 5జీ మోడ్‌లలో కాల్స్ చేస్తుంటారు. 2జీ కాల్స్ స్విచ్చింగ్ ద్వారా కనెక్ట్ అవుతాయి. 3జీ, 4జీ, 5జీ మోడ్‌లలో ఐపీ ద్వారా కాల్స్ కనెక్ట్ అవుతాయి. ప్రతి కాల్ కనెక్ట్ అవ్వడానికి టైం స్లాట్, ఫ్రీక్వెన్సీ స్లాట్ ఉంటాయి. ఈ రెండు స్లాట్లు సెకన్ల వ్యవధిలో అనుమతి పొందేలా ఉంటాయి. అప్పుడే కాల్ అవతలి వ్యక్తికి చేరి మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగా బీప్ సౌండ్ వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక సెల్ టవర్ నిమిషానికి 1000 నుంచి 1500 కాల్స్ వరకు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ పరిమితిలో కాల్స్ వెళ్లేటప్పుడు టైం స్లాట్ వెంటనే యాక్టివేట్ అయ్యి ఫోన్ కాల్ అవతలి వ్యక్తికి చేరుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇటీవల కాల్స్ మాట్లాడే సమయం కూడా పెరిగింది. 2010లో ఒక కాల్ మాట్లాడే సగటు సమయం 2 నిమిషాలు ఉండగా.. ప్రస్తుతం ఈ సమయం 7 నిమిషాలకు చేరుకుంది. ఫలితంగా ఒక్కో సెల్ టవర్ పరిధిలో సామర్థ్యానికి మించి కాల్స్ వెళ్లడం వల్ల ఈ అసౌకర్యం కలుగుతోందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. కాల్స్ రద్దీ తగ్గితే ఈ సమస్య ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment