ఒక్కొక్క కుటుంబానికి రూ.1.20 లక్షలు జమ
గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు సాయం
ఎనిమిది నెలల్లో పైసా విదల్చని ప్రభుత్వం
పథకం అమలు చేయకపోతే కులవృత్తికి దూరమే
రెండు రోజుల పాటు భార్యభర్తలిరువురం కష్టపడి ఒక చీర నేస్తే వచ్చే కూలి రూ.500లు. అదే బయట పనులకు పోతే రూ.1500లు సంపాదిస్తాం. కులవృత్తిని వదులుకోలేక ఇబ్బంది పడినా ఇదే పనిలో కొనసాగుతున్నాం. గత ప్రభుత్వంలో మాకు ఏటా రూ.24 వేల చొప్పున సాయం అందించారు. ఈ నిధులతో ముడిసరుకు కొనుగోలు చేసి వస్త్రాలు తయారు చేసి మేమే అమ్ముకునే వాళ్లం. రోజుకు వెయ్యి రూపాయలు ఇంటి వద్దే ఉండి సంపాదించుకునే వాళ్లం. ఈ పథకాన్ని కొనసాగించకపోతే మళ్లీ కులవృత్తికి దూరం కావాల్సిందే.
–గుద్దటి లక్ష్మి, నేత కార్మికురాలు
రద్దుల ఖాతాలో కలిపేశారా..
Comments
Please login to add a commentAdd a comment