మహిళల రక్షణకు పింక్ ఆర్మీ సేవలు
సీతంపేట (విశాఖ): గ్లోబల్ పింక్ ఆర్మీ విశాఖ శాఖను ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ పింక్ ఆర్మీని సింధు మంగళవేద స్థాపించారని తెలిపారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సేవలందిస్తున్నట్టు తెలిపారు. మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పింక్ ఆర్మీ అవగాహన కల్పిస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కళాశాల ప్రాంగణాల్లో మహిళల భద్రతకు, హింసను నివారించేందుకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వివరిస్తూ అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖ పార్లమెంట్ బీజేపీ కార్యదర్శి నాదెళ్ల జ్యోతి, గ్లోబల్ పింక్ సహ వ్యవస్థాపకుడు దీకప్ టాటర్ జైన్, రేంజర్ ఫోర్స్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శిడగం నాగేంద్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment