జగనన్నే మాకు నిజమైన నేస్తం
మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం ఇచ్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. కూటమి సర్కారు వచ్చి ఎనిమిది నెలలు గడుస్తోంది. ఈ పథకం కొనసాగిస్తారో లేదో చెప్పడం లేదు. నేత కార్మికులకు మళ్లీ పాత రోజులు దాపురించే పరిస్థితి కనిపిస్తోంది.అప్పులు చేసి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. ముడిసరుకు కోసం వడ్డీలకు అప్పులు తేవడం మా వల్ల కాదు. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని యధావిధిగా కొనసాగించి మా కులవృత్తిని కాపాడాలి.
–మాడెం అప్పలరాజు, నేత కార్మికుడు, నక్కపల్లి
Comments
Please login to add a commentAdd a comment