ఏటీఎం చోరీకి విఫలయత్నం
మునగపాక: చూచుకొండలో ప్రైవేటు ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఏటీఏం ముందు కారం జల్లి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండలంలోని చూచుకొండ సచివాలయం పక్కనే ఇండియా–1 ఏటీఎంను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఏంను చోరీ చేసేందుకు యత్నించారు. ఏటీఎంలో నగదు ఉంచే బాక్సు ఓపెన్ కాకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే తాము ఎవరో తెలుసుకోకుండా ఉండేందుకు ఏటీఎం ముందు కారం జల్లి చల్లగా జారుకున్నారు. విషయం తెలుసుకున్న సంబంధిత బ్యాంక్ సిబ్బంది ఏటీఎంను తెరిచి చూడగా అందులో ఉండాల్సిన నగదు రూ.6 లక్షల 27 వేలు క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలాగే డీఎస్పీ విష్ణుస్వరూప్, రూరల్ సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐ పి.ప్రసాదరావు ఇండియా–1 ఏటీఎంను పరిశీలించారు.
చూచుకొండలో నగదు అపహరణకు ప్రయత్నం
Comments
Please login to add a commentAdd a comment