వైఎస్ జగన్‌ను కలిసిన జిల్లా నేతలు
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జిల్లా నేతలు మర్యాదపూర్వగంగా కలిశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు, చోడవరం సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో పార్టీ బలోపేతానికి కృషి చేసి.. కార్యకర్తలను కలుపుకొని పోవాలని ధర్మశ్రీతో జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో పార్టీ పరిస్థితి గురించి వాకబు చేస్తూ.. బాధ్యతలు అప్పగించిన వెంటనే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల్లో జోష్ పెంచావని అభినందించారు.
చోడవరం నియోజకవర్గంలో గుడివాడ అమర్‌నాథ్‌కు అండగా ఉండాలని ధర్మశ్రీకి సూచించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ తమ అధినేత జగన్ చాలా ఉత్సాహంగా ఉన్నారని, కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్తేజంతో పనిచేయాలని కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment